
రోహిత్ వేముల వర్ధంతి సభలో కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిస్కైలాబ్బాబు. …………. ..,..,……………………
హైదరాబాద్ బి న్యూస్ తెలంగాణ జనవరి 17 విద్యాలయాల్లో విష పురుగులు గా కాషాయ మతోన్మాదుల మారారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బ్ బాబు అన్నారు. గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో రోహిత్ వేముల మూడవ వర్ధంతి సభను నిర్వహించారు రోహిత్ వేముల చిత్రపటానికి చర్చల ప్రతినిధి చంద్రన్న పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సభకు కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ఉన్నత విద్యాలయాల్లో కాషాయ మతోన్మాదుల విష పురుగులు గా మారి భావి మేధావులను యూనివర్సిటీలో భావ ప్రకటన స్వేచ్ఛను ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. మతసామరస్యం ప్రగతిశీల భావాల ను అభివృద్ధి చేయటం మతోన్మాదులను ప్రతిఘటించడం ద్వారానే రోహిత్ వేముల ఆశయాలు ముందుకు ముందుకు తీసుకెళ్తారని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు మైనారిటీలపై దాడులు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి అన్నారు.బావి మేధావులు జర్నలిస్టులు ప్రశ్నించే గొంతులను బిజెపి ప్రభుత్వం మట్టు పెట్టిందన్నారు. జనవరి 17 2016 హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ భావాలకు ప్రతినిధిగా ఉన్న బావి మేధావి రోహిత్ వేముల తో పాటు మరో నలుగురిని ఆ కారణంగా వీసీ అప్పారావు సాంఘిక బహిష్కరణ చేశారు ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో భావప్రకటన స్వేచ్ఛ తో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చే నందుకు మతోన్మాద ఛాందస భావాలు కలిగిన ఏబీవీపీ శక్తులు కేంద్ర మంత్రులతో రోహిత్ వేముల మానసికంగా వేధించి వ్యవస్థీకృతంగా హత్య గావించారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక యూనివర్సిటీల్లో ఈ హత్యను ముక్త కంఠంతో ఖండించి బిజెపి అరాచకాలను ఎండగట్టారు అని గుర్తు చేశారు. జేఎన్యూలో విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ పై రాజద్రోహం కేసు మద్రాసు అంబేద్కర్ పూలే స్టడీ సర్కిల్ పై మతోన్మాదుల దాడి వంటి అంతరాలు జరగాయని అన్నారు. నేడు ఆర్ఎస్ఎస్ ఛాందస భావాలు అన్నింటిని విద్యారంగంలో ప్రవేశపెట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మూఢత్వం లో ఇముడ్చుకుంటూన్నారని వివరించారు. సైన్స్ కాంగ్రెస్లో ఆంధ్ర యూనివర్సిటీ విసి అజ్ఞానపు వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అన్నారు.సెంట్రల్ యూనివర్సిటీలో జనవరి 6న రోహిత్ వేముల స్మృతి చిహ్నంగా ఉన్న వెలివాడ ను తొలగించడం సిగ్గుచేటన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మతోన్మాద శక్తులు విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలవడం వల్ల మార్క్స్ అంబేద్కర్ ఆలోచనల పై దాడి పెరిగిందన్నారు.మతోన్మాదులను సామాజికంగా ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ ఏపీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మ నాయక్ , కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.రమణ, తదితరులు ప్రసంగించిన వారిలో ఉన్నారు.