B NEWS TELANGANA LIVE TV CHANNEL

జీవో ఔషధ రంగంలో విద్యార్థులు యువతకు మంచి భవిష్యత్తు ఉంది.

బి న్యూస్ తెలంగాణ లైవ్ టీవీ ఛానల్ హైదరాబాదు జనవరి 26:- జీవ ఔషధ రంగంలో విద్యార్థులు యువతకు మంచి భవిష్యత్తు ఉందని మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఇండియన్ ఫార్మాసూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ఐ పి ఎస్ డైరెక్టర్ డాక్టర్ టీవీ నారాయణ అన్నారు ఔషధ రంగంలో మరిన్ని పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలతో దేశానికి మంచి పేరు తేవాలని అన్నారు బర్కత్పురాలోని అవంతి డిగ్రీ పీజీ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బయో అధ్యయనం 2 కె 19 పేరుతోజాతీయ జీవ విషాద వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఔషధ శాస్త్రంలోని సాంకేతిక రంగాలను విద్యార్థులు పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశోధనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీ ఫలాలను అట్టడుగు స్థాయి ప్రజలకు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.ఇండియన్ ఫార్మాసూటికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఔషధ రంగంలో రానున్న రోజుల్లో యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి అని పేర్కొన్నారు ఔషధ రంగంలో మరిన్ని నూతన ఆవిష్కరణ రావాలని ఇందుకోసం విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నేడు ఉన్న మార్కెట్ పోటీని తట్టుకొని నిలబడే విధంగా విద్యార్థులు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నారు. ఔషధ రంగంలో దేశంలో ఎంతో పురోగతి సాధించిందని అయినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు క్యాన్సర్ వ్యాధి నివారణకు మరిన్ని మెరుగైన పరిశోధనలు జరగాలని మరిన్ని బలమైన అవసరాలు రావాల్సిన అవసరం ఉందన్నారు సమాజాన్ని క్యాన్సర్ మహమ్మారి లభిస్తుందని చెప్పారు పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నూతన ఔషధాల తయారీకి నడుము బిగించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ సి డి ఎస్ అరబిందో ఫార్మా సైంటిస్ట్ అనిల్ కుమార్ రెడ్డి డాక్టర్ సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ విజయ భాస్కర్ డాక్టర్ డి సదాశివుడు డాక్టర్ రవి జేఎన్టీయూహెచ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ప్రొఫెసర్ జి కృష్ణమోహన్ కామన్వెల్త్ ఫార్మాసూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ఎస్ వి వడ్లమూడి విభాగం ప్రొఫెసర్ అవంతి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s