ప్రమాణస్వీకారానికి రమ్మని ఆహ్వానం!

ఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్న జగన్‌.. నేరుగా లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించారు. ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయింపు తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో జగన్ వెంట పలువురు అధికారులూ ఉన్నారు. మోదీని కలిసిన జగన్‌ బృందంలో లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గాని భరత్‌, నందిగం సురేశ్‌తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నారు. అనంతరం ఏపీ భవన్‌లో అధికారులతో జగన్ భేటీ కానున్నారు.ఏపీ భవన్‌ సిబ్బందితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. స్థానికంగా తనను కలవడానికి వచ్చేవారితోనూ జగన్‌ మాట్లాడనున్నారు. దిల్లీలోని మధ్యాహ్న భోజనం ఏపీ భవన్‌లోనే చేసి సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారు. దిల్లీ నుంచి ఆయన తిరుపతికి వెళ్లి అక్కడే బస చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s