లాడ్జీకి తీసుకెళ్లి గొంతుకోశాడు

బి న్యూస్ తెలంగాణ 09జులై 2019హైదరాబాద్‌:- దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం జరిగింది. యువతిపై ఓ యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. యువతిపై హత్యాయత్నం చేసిన తర్వాత యువకుడు వెంకటేష్‌ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… ఈ ఉదయం బృందావన్‌ లాడ్జీలోకి ఓ జంట అద్దెకు దిగింది. మధ్యాహ్నం వేళ యువకుడు చాకుతో యువతి గొంతు కోశాడు. యువతి గొంతుకోసిన తర్వాత వెంకటేశ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌ది నెల్లూరు కాగా.. యువతి మనస్విని బడంగ్‌పేట్‌ వాసిగా గుర్తించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నానికి కారణమేంటో దర్యాప్తు చేస్తున్నారు దారుణం జరిగింది. యువతిపై ఓ యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. యువతిపై హత్యాయత్నం చేసిన తర్వాత యువకుడు వెంకటేష్‌ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… ఈ ఉదయం బృందావన్‌ లాడ్జీలోకి ఓ జంట అద్దెకు దిగింది. మధ్యాహ్నం వేళ యువకుడు చాకుతో యువతి గొంతు కోశాడు. యువతి గొంతుకోసిన తర్వాత వెంకటేశ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌ది నెల్లూరు కాగా.. యువతి మనస్విని బడంగ్‌పేట్‌ వాసిగా గుర్తించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నానికి కారణమేంటో దర్యాప్తు చేస్తున్నారు

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి…..

బి న్యూస్ తెలంగాణ సూర్యాపేట జూలై 2019 : రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మోతె మండలం ఉర్లుగొండ గ్రామానికి చెందిన చామకూరి సుధాకర్‌గౌడ్‌(32) ఆదివారం అర్థరాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో బుల్లెట్‌ వాహనంపై అతివేగంగా వచ్చిన యువకులు సుధాకర్‌ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మొదట చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్సకోసం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. సుధాకర్‌కు భార్య రాధిక, కుమారుడు రుషికేశ్‌(5), నిహారిక (3) ఉన్నారు. వీరితో కలిసి సుధాకర్‌ సూర్యాపేట వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన సుధాకర్‌ కానిస్టేబుల్‌గా మొదట ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విధుల్లో చేరారు. రెండేళ్ల క్రితం తెలంగాణలోని మేళ్లచెర్వు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి ఇటీవల సూర్యాపేట ఠాణాకు బదిలీపై వచ్చారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు యువకులు మద్యం మత్తులో అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి తన భర్త ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సుధాకర్‌ భార్య రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రాసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు.

ఎస్పీ నివాళి
కానిస్టేబుల్‌ సుధాకర్‌ భౌతికకాయానికి ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేశ్వరరావు, సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ వెంకటనారాయణ, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, పోలీస్‌ సిబ్బంది జిల్లా కేంద్రాసుపత్రిలో నివాళి అర్పించారు. భార్యకు ఎస్పీ తక్షణ సాయంగా రూ.25వేలు అందజేశారు. అనంతరం జిల్లా కేంద్రాసుపత్రి నుంచి నిర్వహించిన సుధాకర్‌ అంతిమయాత్రలో పట్టణ పోలీసులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.

సుధాకర్‌ మృతితో ఉర్లుగొండలో విషాదఛాయలు
ఉర్లుగొండ (మోతె), న్యూస్‌టుడే: సూర్యాపేటలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీసు కానిస్టేబుల్‌ చామకూరి సుధాకర్‌ అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం మోతె మండలంలోని ఉర్లుగొండలో జరిగాయి. సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్‌లో పీసీగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌ అందరికి తలలో నాలుకలా ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. సుధాకర్‌ ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం మృతుడు సుధాకర్‌ పుట్టిన రోజని స్నేహితులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. పుట్టిన రోజు ఘడియల్లోనే మృత్యువు ముంచుకొచ్చిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడ చేరినవారికి సైతం కంటతడి తెప్పించింది. సుధాకర్‌ మృతదేహాన్ని జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు రాంచందర్‌గౌడ్‌, అమర్‌సింగ్‌, సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ శివకుమార్‌ సందర్శించి నివాళి అర్పించారు.

ప్రభుత్వ టెండర్లలో వడ్డెర్లకు పన్ను శాతం ఇవ్వాలి: శివరాత్రి ఐలమల్లు

బిన్యూస్ తెలంగాణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం 7 జూలై 2019:- శనివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంగం అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభువు ప్రభుత్వ టెండర్లలో వడ్డెర్లకు 15 శాతం పన్ను వడ్డెర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డెర కులానికి న్యాయం చేయకపోగా అనాదిగా వస్తున్న జీవోలు చట్టాలను రిజర్వేషన్లను అమలు చేయడం లేదన్నారు. కొద్దో గొప్పో అరకొరగా చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చెసుకుంటు జీవిస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వటెండర్లలో15 శాతం పన్ను వడ్డెర్లకు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మల్లన్న సాగర్ మేడారం జాతర పంచాయతీరాజ్ శాఖ సింగరేణి లాంటి పెద్ద పెద్ద టెండర్లలో వెనకబడిన వడ్డెర కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలన్నారు. వడ్డెర కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే అవకాశం కల్పించాలనే కోరారు ఈ యొక్క కార్యక్రమంలో శివరాత్రి పుల్లయ్య, పల్లపు యాదయ్య ,తురక వీరబాబు దేవల్ల వీరన్న తదితరులు పాల్గొన్నారు

వడ్డెర్లకు ప్రభుత్వ టెండర్లలో 15 శాతం పన్ను ఇవ్వాలి: శివరాత్రి ఐలమల్లు

బిన్యూస్ తెలంగాణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం 7 జూలై 2019:- శనివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభువు ప్రభుత్వ టెండర్లలో వడ్డెర్లకు 15 శాతం పన్ను వడ్డెర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డెర కులానికి న్యాయం చేయకపోగా అనాదిగా వస్తున్న జీవోలు చట్టాలను రిజర్వేషన్లను అమలు చేయడం లేదన్నారు. కొద్దో గొప్పో అరకొరగా చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చెసుకుంటు జీవిస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వటెండర్లలో15 శాతం పన్ను వడ్డెర్లకు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మల్లన్న సాగర్ మేడారం జాతర పంచాయతీరాజ్ శాఖ సింగరేణి లాంటి పెద్ద పెద్ద టెండర్లలో వెనకబడిన వడ్డెర కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలన్నారు. వడ్డెర కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే అవకాశం కల్పించాలనే కోరారు ఈ యొక్క కార్యక్రమంలో శివరాత్రి పుల్లయ్య, పల్లపు యాదయ్య ,తురక వీరబాబు దేవల్ల వీరన్న తదితరులు పాల్గొన్నారు

*కేసీఆర్-జగన్ భేటీ లో చర్చించే కీలక అంశాలు

బి న్యూస్ తెలంగాణ లైవ్ టీవీ ఛానల్26/06/2019 :-నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కాబోతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా… కృష్ణా, గోదావరి నదీ జలాల్ని రెండు రాష్ట్రాలకు ఎలా పంచుకోవాలి అన్న అంశంపై ప్రధానంగా చర్చిస్తారు. అందుకే ఈ సమావేశంలో… ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొనబోతున్నారు. ఈ భేటీ కోసం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచీ తిన్నగా లోటస్‌పాండ్‌లోని తన ఇంటికి వెళ్లారు. తర్వాత తన సలహాదారుడైన శామ్యూల్ కొడుకు పెళ్లికి వెళ్లారు. వీళ్లిద్దరి భేటీలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధాన కారణం జగనే. ఇప్పటివరకూ ఆయన ఏ సమావేశాలు పెడుతున్నా… సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం… గోదావరిలో తెలుగు రాష్ట్రాలకు 1480, కృష్ణాలో 811 టీఎంసీలు ఉన్నాయి. వీటితోపాటూ… మరో 3500 టీఎంసీలు వేస్టుగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీరు ఎంత అవసరమో మనకు తెలుసు. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులూ మాట్లాడుకుంటే… దాదాపు 5వేల TMCల నీటిని కాపాడినవాళ్లవుతారు.

నీటి అంశంతోపాటూ… విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద ఉన్న సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనపై చర్చిస్తారని తెలిసింది. అలాగే RTC, ఎలక్ట్రిసిటీ సంస్థలపై కూడా చర్చిస్తారని సమాచారం. వీటితోపాటూ… ఏపీకి చెందిన 1157 మంది కరెంటు ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. వాళ్లను ఏపీకి పంపించే అంశంపైనా చర్చ జరగనుంది.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన

బి న్యూస్ తెలంగాణ14/06/2019:-ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందని, బడీడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శేరిలింగంపల్లి‌ డివిజన్ కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లి‌ డివిజన్ పరిధిలోని సురభి‌కాలనీ‌ ఆంగ్ల మాద్యమ‌ ప్రభుత్వ ప్రాథమిక‌ పాఠశాలలో డీఈఓ సత్యనారాయణతో కలిసి కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. సురభి‌ కాలనీ,‌సందయ్య నగర్, రాజీవ్ గృహకల్పలో విద్యార్థులతో కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరిస్తూ బడీడు పిల్లలను తప్పకుండా‌ ప్రభుత్వ బడిలో చేర్పించాలంటూ బడిబాట నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. అంతకుముందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాద్యాయులు శంకర్, ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, శివకుమార్, సురేష్, బలరాం, కిష్టయ్య, రవీందర్ పాల్గొనగా సురభి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు అశ్రప్, స్వర్ణలత, మహేశ్వరీ, హిమబిందు, జయశ్రీ, ప్రవళిక, మల్లికాంబ, రాజు, నిర్మాణ్ అర్గనైజేషన్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కృష్ణ కుమారి, వెల్స్ పార్గో సాప్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు, వార్డు మెంబర్ శ్రీకళ, టీఆర్ఎస్ నాయకులు బద్దం కొండల్ రెడ్డి, చంద్రకళ, రజిని, కళ్యాణి, కమల, రోజా తదితరులు ఉన్నారు.