సినీ నటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ

ఫిలింనగర్ బి న్యూస్ తెలంగాణ జనవరి 17:-
తెలుగు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం(62)కు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్(ఏహెచ్‌ఐ)లో ఆయనకు ఆపరేషన్ జరిగినట్లు బ్రహ్మానందం కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఏహెచ్‌ఐకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. హార్ట్ సర్జన్ రమాకాంత్ పాండా సోమవారం బ్రహ్మానందంకు సర్జరీ చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన కొడుకులు రాజా గౌతమ్, సిద్దార్థ్ ఆసుపత్రిలో దగ్గరుండి చూసుకున్నారు. బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ట్వీట్స్, కామెంట్స్ చేశారు. బ్రహ్మానందం మొత్తం 1000కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.

Advertisements

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

*ఫ్లాష్.. ఫ్లాష్..ఫ్లాష్..*
–————-
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం.

జనగామ బి న్యూస్ తెలంగాణ జనవరి 17 :-జనగామ జిల్లా గుండాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే చెరుకు శంకర్(32) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం లో దుర్మరణం పాలయ్యాడు.ఆరు మాసాల క్రితమే పోలీస్ ఉద్యోగంలో చేరిన శంకర్ ది నల్లగొండ జిల్లా కటంగూర్ మండలం పోనగళ్ళు గ్రామం.కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శంకర్ విధినిర్వహణలో భాగంగా సుద్దాల గ్రామంలో సమన్లు అందజేసి తిరిగి స్టేషన్ కు బయలుదేరి వస్తుండగా బ్రాహ్మణపల్లి శివారులో బైక్ అదుపు తప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు.* *చికిత్స నిమిత్తము జనగామ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా శంకర్ మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కి దూసుకుపోయిన లారీ…

కరీంనగర్ జిల్లా బి న్యూస్ తెలంగాణ జనవరి 16:-
హుజూరాబాద్ కరీంనగర్ నుండి వరంగల్ మూలమలుపు వద్ద ఉదయం 5 గంటల ప్రాంతంలో అదుపుతప్పి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కి దూసుకుపోయిన లారీ.రహదారి పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొని కాలేజీలోకి దూసుకుపోవడంతో కాలేజీకి చెందిన రూమ్ ధ్వంసమైనది.మధ్యప్రదేశ్ కు చెందిన RJ11-GB-1438 పేపర్ లోడ్ లారీలో డ్రైవర్ రవి క్లీనర్ శ్రీకాంత్ ఉన్నారు వీరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.పట్టణ వాసంశెట్టి మాధవి ఎస్ఐ చంద్రశేఖర్ వారి సిబ్బంది తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.లారీ ట్రాన్స్ ఫార్మర్ స్థాబాలకు ఢీకొనడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోవడం వలన విద్యుత్ అంతరాయం.హుజురాబాద్ లో ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అంతరాయం నిలిపి వేయడం జరుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే కేసీఆర్ గారి లక్ష్యం : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ బి న్యూస్ తెలంగాణ జనవరి 16:- దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఏడాది కాలంగా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తు న్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ తెలిపారు. నగరంలోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారితో జరిగిన కేటీఆర్ గారి భేటీ ముగిసింది. భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే జగన్‌తో భేటీ అయినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడం కోసం సీఎం కేసీఆర్ గారు ప్రత్యామ్నాయం దిశగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా పలువురు జాతీయ నేతలతో కేసీఆర్ ఇప్పటికే చర్చించారన్నారు. ఈ క్రమంలో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై మాట్లాడేందుకు జగన్ వద్దకు వచ్చామన్నారు. ప్రజాకాంక్షకు అనుగుణంగా రాజకీయాలు ఉండాలి. త్వరలో కేసీఆర్ గారు స్వయంగా ఏపీకి వెళ్లి జగన్‌మోహన్ రెడ్డి గారితో చర్చిస్తారని చెప్పారు. జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ఆకాంక్షలు నిలబెట్టే క్రమంలో కేసీఆర్ గారు చేస్తున్న ప్రయాణంలో వైసీపి తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో సంపూర్ణ మద్దతు:ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్ వైఖరిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సహా తమ ఎంపీలు అనేక సార్లు చెప్పారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తమ వైఖరిలో మార్పు లేదన్నారు. నాడు ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరామని పేర్కొన్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి హర్షనీయం: వైసీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కేటీఆర్‌ గారితో భేటీ అనంతరం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్‌పై కేటీఆర్‌తో చర్చించాం. జాతీయస్థాయిలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల్ని అడ్డుకోవడానికి కేసీఆర్ గారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కు దివానా లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేనేలేదు. 17 మంది తెలంగాణ ఎంపీలు కలిస్తే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. 42 మంది ఎంపీలు కలిసి పోరాడితే రాష్ట్రానికి తప్పక మేలు జరుగుతుందన్నారు.
టీఆర్‌ఎస్‌తో చర్చలు స్వాగతించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడుకోవాలంటే సంఖ్యా బలం పెరగాలన్నారు. రాష్ట్రాలు ఒకే తాటిపైకి వస్తే అన్యాయం చేసేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుందన్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే వీలుంటుందన్నారు. భావసారూప్య పార్టీలను ఒకే వేదికపైకి తేవాలన్న కేసీఆర్ గారి నిర్ణయం హర్షనీయమని ఆయన అన్నారు.

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్….

తిరుమలగిరి బి న్యూస్ తెలంగాణ జనవరి 16:- తిరుమలగిరి మండల కేంద్రంలో బుధవారం నాడు రైతులకు అందుబాటులో ఉండే విధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారి చేతుల మీదుగా కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర పలికే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన వివరించారు

ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ తో కేటీఆర్ చర్చలు….

హైదరాబాద్ B న్యూస్ తెలంగాణ జనవరి 16:_ ఫెడరల్‌ ఫ్రంట్‌పై వైకాపా, తెరాస మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస నేతలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి,తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ గారు, ఎంపీలు వినోద్‌, సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈరోజు లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు.