భౌగోళిక హద్దులు మారితే కాదు రాజకీయ బుద్ధులు కూడా మారాలి, బంజారా సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఎలా మిలితం చేశాడో ఈ రచనలో ఉందని వక్తలు అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంజారా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ జే‌. రాజారాం రచించిన తెలంగాణ నా మాతృభూమి పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ మాత్రమే నా మాతృభూమి అని పేరు పెట్టడం చారిత్రక అవసరంగా మారిందని, ఉద్యమం ముందు ఉద్యమం తర్వాత అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానిది. ఇందులో అనేక సంఘటనలు జరిగాయని రాజ్యాధికారం కోసం పోరాటం సాగిందని దీనిలో హరిజనులు గిరిజనులే ముందు భాగంలో నిలబడ్డారని కానీ నేడు తెలంగాణ లో వారికి ఆ ప్రాముఖ్యత లేదని వారన్నారు.సమాజంలో ఏది జరుగుతున్నా గాని కవులు, రచయితలు, జర్నలిస్టులు మాత్రమే ఉన్నది ఉన్నట్టు చూపించ గలుగుతున్నారని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, పుస్తక రచయిత డా: రాజారాం,డా:రాజ్ కుమార్ జాదవ్ లంబాడి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు,డా:బీ.రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment